Jhulan Goswami : ఈడెన్ గార్డెన్‌లో స్టాండ్‌కు జులన్ గోస్వామి పేరు

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలోని ఓ స్టాండ్‌కు లెజెండరీ మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి పేరును పెట్టనున్నారు.

Update: 2024-11-20 19:24 GMT

దిశ, స్పోర్ట్స్ : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలోని ఓ స్టాండ్‌కు లెజెండరీ మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి పేరును పెట్టనున్నారు. బ్లాక్ బీ గ్యాలరీకి ఆమె పేరును పెట్టనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) ప్రకటించింది. బీసీసీఐ, ఐసీసీ ప్రెసిడెంట్ జగ్ మోహన్ దాల్మియా, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తర్వాత ఈ గౌరవం అందుకోనున్న మూడో ప్లేయర్‌గా జులన్ నిలవనున్నారు. వచ్చే ఏడాది జనవరి 22న భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న టీ20 మ్యాచ్ సందర్భంగా దీన్ని ప్రారంభించనున్నారు. 2022 నుంచి ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ భూమి రక్షణ శాఖ పరిధిలో ఉన్నందున అనుమతి కోసం క్యాబ్ ఇన్ని రోజులు వెయిట్ చేసింది. మంగళవారం అనుమతి లభించడంతో క్యాబ్ తాజా ప్రకటన చేసింది.    

Tags:    

Similar News