12 ఏళ్ల తర్వాత టీమిండియాకు మళ్లీ ఆ టాస్క్.. విశాఖ టెస్టులో ఏం జరుగనుంది?
హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. జియో సినిమాలో ఫ్రీగా వీక్షించడానికి అవకాశం ఉంది. అయితే, తొలి టెస్టును భారత జట్టు చేజేతులా కోల్పోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించి డామినేట్ చేసిన ఆటగాళ్లు.. సెకండ్ ఇన్సింగ్స్‌లో కాస్త తడబడ్డారు. ఈ విషయాన్ని గమనించిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు అదునుచూసి దెబ్బ కొట్టారు. దీంతో ఎలాగైనా విశాఖలో గెలిచి పట్టు నిలుపుకోవాలని టీమిండియా చూస్తోంది.
అయితే, అనూహ్యంగా ఈ మ్యాచ్‌కు జడేజా, రాహుల్ దూరమైన విషయం తెలిసిందే. వీరి స్థానంలో జట్టులోకి సర్ఫరాజ్, రజత్ పటీదార్, సౌరభ్ కుమార్ వచ్చారు. ఇప్పుడు తుది జట్టులో వీరిలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరం. అలాగే జడ్డూ స్థానంలో స్పిన్నర్‌గా కుల్దీప్ ఆడే చాన్స్ ఉంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత కోహ్లీ, జడేజా, పూజారా, రాహానే ఈ నలుగురు స్టార్ ప్లేయర్లు లేకుండానే తొలిసారిగా టీమ్ ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. మరి ఈ మ్యాచ్‌లో అయిన నెగ్గుతారో లేదో చూడాలి. మొత్తం ఐదు టెస్టు మ్యాచ్ సీరిస్‌లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు ఇండియాలో పర్యటిస్తోంది.