అగ్ర స్థానంలో నిలిచిన అగ్రరాజ్యం.. మొత్తం ఎన్ని పతకాలో తెలుసా?
పారిస్ వేదికగా 17 రోజుల పాటు అట్టహాసంగా జరిగిన ఒలంపిక్ క్రీడలు ముగిశాయి. ఆదివారం నాడు ఈ క్రీడలకు ముగింపు పలికారు.
దిశ, వెబ్‌డెస్క్: పారిస్ వేదికగా 17 రోజుల పాటు అట్టహాసంగా జరిగిన ఒలంపిక్ క్రీడలు ముగిశాయి. ఆదివారం నాడు ఈ క్రీడలకు ముగింపు పలికారు. ఈ ఒలంపిక్స్‌లో 125 పతకాలతో అగ్రరాజ్యమైన అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో 39 స్వర్ణాలు, 44 రజతాలు, 42 కాంస్య పతకాలు ఉన్నాయి. 91 పతకాలతో చైనా రెండో స్థానంలో నిలిచింది. అంతేకాదు.. అత్యధికంగా స్వర్ణ పతకాలు కూడా చైనా ఖాతాలోనే ఉండటం విశేషం. మొత్తంగా 40 స్వర్ణాలు, 27 రజతాలు, 24 కాంస్య పతకాలు చైనా సాధించింది. ఇక ఈ ప్రతిష్టా్త్మక టోర్నమెంట్‌లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు సైతం మెరిశారు. మొత్తంగా ఇండియా ఆరు పతకాలు సాధించింది. అందులో 5 కాంస్య పతకాలు, ఒక రజత పతకం ఉంది. కాగా, జూలై 26వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్.. ఆగష్టు 11వరకు విజయవంతంగా కొనసాగింది.