జైశ్వాల్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ప్రశంసల వర్షం
టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైశ్వాల్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ ప్రశంసల వర్షం కురిపించారు. విశాఖలో జరుగుతున్న రెండో టెస్టులో మొదటిరోజు యశస్వి ఆటను పరిశీలించిన కుక్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైశ్వాల్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ ప్రశంసల వర్షం కురిపించారు. విశాఖలో జరుగుతున్న రెండో టెస్టులో మొదటిరోజు యశస్వి ఆటను పరిశీలించిన కుక్ కీలక వ్యాఖ్యలు చేశారు. జైశ్వాల్ ఆటతీరు అసాధారణం అని కొనియాడారు. 22 ఏళ్ల వయసులోనే ఇంత టాలెంట్ ఉంటడం నిజంగా అద్భుతం అన్నారు. తన మొత్తం కెరీర్‌లో చూసిన అత్యుత్తమ ఇన్నింగ్సుల్లో ఇదొకటి అని చెప్పారు. కేవలం జైశ్వాస్ బ్యాటింగ్ మినహాయిస్తే మిగతా బ్యాట్‌మెన్లంతా పేలవ ప్రదర్శన కనభరుస్తున్నారని తెలిపారు.
జైశ్వాల్‌ను కట్టడి చేయకపోతే ఇంగ్లాండ్‌కు కష్టాలు తప్పవని సొంత జట్టుకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఈ మ్యాచ్‌లో జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీతో పెను విధ్వంసం సృష్టించాడు. 179 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటలో బరిలోకి దిగిన జైస్వాల్ ఆరంభం నుంచి ధాటిగా ఆడాడు. మరొక 21 బంతుల్లోనే మిగతా 21 పరుగులు చేసిన డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 18 ఫోర్లు, 7 సిక్సులతో 277 బంతుల్లోనే 209 పరుగులు చేశాడు.