ఆ సత్తా బుమ్రాకు ఉంది : రషీద్ ఖాన్
టీ20 క్రికెట్‌లో బౌలర్లు తమ నైపుణ్యాలను నమ్ముకోవాలని ఆఫ్ఘనిస్తాన్, గుజరాత్ టైటాన్స్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తెలిపాడు.
దిశ, స్పోర్ట్స్ : టీ20 క్రికెట్‌లో బౌలర్లు తమ నైపుణ్యాలను నమ్ముకోవాలని ఆఫ్ఘనిస్తాన్, గుజరాత్ టైటాన్స్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తెలిపాడు. టీ20 క్రికెట్‌లో బ్యాటర్ల ఆధిపత్యం పెరుగుతున్న నేపథ్యంతో తాజాగా రషీద్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బౌలర్లు పిచ్, బౌండరీ సైజ్ గురించి ఆలోచించడం మానేసి తమ నైపుణ్యాలపై ఫోకస్ పెట్టాలన్నాడు. ‘పిచ్, బౌండరీ సైజ్ గురించి ఆలోచిస్తే బౌలర్లు పరుగులు ఇస్తున్నారని అంగీకరించినట్టే అవుతుంది. బౌలర్ ఏం చేయలేడని ఒప్పుకున్నట్టే. మంచి యార్కర్ ఎవరూ బంతిని బాదలేరు. మంచి బాల్స్ వేసేలా ప్రాక్టీస్ చేయకపోతే, మంచి బంతి వేయలేకపోతే పరుగులు వస్తాయి. బౌలర్లు తమను తాము ప్రశ్నించుకోవాలి. వరుసగా మూడు యార్కర్లు వేయగలమా?.. సరైన్ బౌన్సర్ సంధిస్తామా?. వైడ్ స్లోయర్ లేదా వైడ్ యార్కర్ వేయగలమా?.. ఆ నైపుణ్యాలు మనలో ఉన్నాయా? అని ప్రశ్నించుకోవాలి. పిచ్, బౌండరీ సైజ్ గురించి కాకుండా వీటి గురించి ఆలోచించాలి.’ అని రషీద్ తెలిపాడు.
ఈ సందర్భంగా బుమ్రాపై రషీద్ ప్రశంసలు కురిపించాడు. బుమ్రాకు తన నైపుణ్యాలపై నియంత్రణ ఉందని, ఎక్కడైనా మంచి యార్కర్లు వేయగలగితే సత్తా అతని ఉందన్నాడు. ‘ఎలా బౌలింగ్ చేయాలనేది బుమ్రాకు తెలుసు. అందుకే, అతని బౌలింగ్‌లో బ్యాటర్లు తడబడతారు. అతని నైపుణ్యాలపై నియంత్రణ ఉంటుంది. మంచి యార్కర్లు వేయగలడు. ఎప్పుడైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ పిచ్‌పైన అయినా అతను బౌలింగ్ చేయగలడు.’ అని చెప్పుకొచ్చాడు.