Emerging AsiaCup : టీంఇండియాకు భారీ లక్ష్యాన్ని విసిరిన ఆఫ్ఘన్ జట్టు
ఎమర్జింగ్ ఆసియాకప్ (Emerging AsiaCup) రెండో సెమీఫైనల్లో భారత్(Bharath) 'ఏ' జట్టుకు అఫ్గనిస్థాన్(Afghanistan)‘ఏ’ భారీ లక్ష్యాన్ని సవాల్ విసిరింది.
దిశ, వెబ్ డెస్క్ : ఎమర్జింగ్ ఆసియాకప్ (Emerging AsiaCup) రెండో సెమీఫైనల్లో భారత్(Bharath) 'ఏ' జట్టుకు అఫ్గనిస్థాన్(Afghanistan)‘ఏ’ 207 పరుగుల భారీ లక్ష్యాన్ని సవాల్ విసిరింది. టాస్ గెలిచిన అఫ్గన్ జట్టుకు ఓపెనర్లు సెదికుల్లాహ్ అటల్(83), జుబైద్ అక్బరీ(64)లు చెలరేగడంతో సునాయాసంగా స్కోర్ రెండు వందలు దాటింది. తొలి ఓవర్ నుంచే భారత బౌలర్లను ఉతికేసిన ఈ జోడీ జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. కెప్టెన్ తిలక్ వర్మ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఇద్దరూ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దాంతో అఫ్గన్ ఏ జట్టు 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే నష్టపోయి 206 పరుగులు చేసింది. ఒమన్ వేదికగా జరుగుతున్న ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్ బెర్తు కోసం భారత 'ఏ' జట్టు ఈ మ్యాచ్ లో చెమటోడ్చాల్సి రావొచ్చు. లీగ్ దశలో అన్నిజట్లను చిత్తుగా ఓడించిన టీమిండియాకు సెమీస్‌లో అఫ్గనిస్థాన్ జట్టు పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించింది.