Paris Olympics: ఏం లేకుండానే రజత పతకం గెలుచుకున్న 51 ఏళ్ళ టర్కీ షూటర్

పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడలలో టర్కీ పిస్టల్ షూటర్ యూసుఫ్ డికేక్ (Yusuf Dikec) మెడల్ సాధించిన తీరు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

Update: 2024-08-02 10:44 GMT

దిశ,వెబ్ డెస్క్ : పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడలలో టర్కీ పిస్టల్ షూటర్ యూసుఫ్ డికేక్ (Yusuf Dikec) మెడల్ సాధించిన తీరు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. దీంతో అతను సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాడు. నిన్న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీం ఈవెంట్‌ పోటీలలో తన జోడి సెవ్వాల్ ఇలయ్దాతో కలిసి బరిలోకి దిగాడు. ఈ క్రమంలో ... అతను జేమ్స్ బాండ్ సినిమా హీరోల టీషర్ట్ వేసుకొని వచ్చి సిల్వర్ పతాకాన్ని కొట్టేశాడు.దీంతో అతనిపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సాధారణంగా షూటర్లు షూటింగ్ ఈవెంట్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మెరుగైన గురి కోసం సన్ గ్లాసెస్, బయట నుండి వచ్చే శబ్దాల రక్షణ కోసం ఇయర్ ప్రొటెక్టర్లను షూటర్లు వాడుతుంటారు. కానీ, ఈ 51 ఏళ్ళ షూటర్ మాత్రం అవేమి ధరించకుండా షూటింగ్ చేసిన విధానం అందరిని ఆకట్టుకుంటోంది. అతను మెడల్ సాధించినదానికంటే... తాను కాల్చిన తీరు అందరిని మైమరిపిస్తోంది. ప్రస్తుతం అతని షూటింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా,ఈ ఈవెంట్లో భారత జోడి మను భాకర్, సరబ్జోత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారనే సంగతి తెలిసిందే.


Similar News