WTC 2023-25 టీమిండియా మ్యాచ్ షెడ్యూల్ ఇదే..

WTC Final ఓటమిని మరవకముందే WTC 2023-25కు కొత్త షెడ్యూల్ విడుదలైంది.

Update: 2023-06-14 14:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: WTC Final ఓటమిని మరవకముందే WTC 2023-25కు కొత్త షెడ్యూల్ విడుదలైంది. జులైలో విండీస్‌తో టీమిండియా రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఈసారి భారత జట్టు 19 టెస్టులు ఆడనుంది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఐదు, బంగ్లాదేశ్‌తో రెండు, న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడనుంది. వెలుపల విండీస్‌తో రెండు, దక్షిణాఫ్రికాతో రెండు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనుంది. ఈ సీజన్‌లో టీమ్ ఇండియా మొత్తం 19 టెస్టులు ఆడనుంది.

జులై 12 నుండి జులై 16 వరకు డొమినికాలో, జులై 20 నుండి జులై 24 వరకు ట్రినిడాడ్‌లో వెస్టిండీస్‌తో 2 టెస్టులు భారత జట్టు తలపడనుంది.

డిసెంబర్ 2023 - జనవరి 2024 మధ్య సౌతాఫ్రికాతో రెండు టెస్టులు..

జనవరి - ఫిబ్రవరి 2024 నెలల్లో ఇంగ్లాండ్.. భారత్‌లో పర్యటిస్తుంది. 5 టెస్టులు జరగనున్నాయి.

సెప్టెంబర్ - అక్టోబర్ 2024లో బంగ్లాదేశ్.. భారత్‌లో పర్యటిస్తుంది (రెండు టెస్టులు)

అక్టోబర్ - నవంబర్ 2024 మధ్య న్యూజిలాండ్... భారత్‌లో పర్యటిస్తుంది. (మూడు టెస్టులు)

నవంబర్ 2024 - జనవరి 2025లో ఆస్ట్రేలియాలో భారత్ పర్యటిస్తుంది. (ఐదు టెస్టులు)


Similar News