Emerging AsiaCup : ఎమర్జింగ్ ఆసియాకప్ లో టీమిండియా ఓటమి
ఎమర్జింగ్ ఆసియాకప్ (Emerging AsiaCup) రెండో సెమీఫైనల్లో భారత్(Bharath) 'ఏ' ఓటమి పాలైంది.
దిశ, వెబ్ డెస్క్ : ఎమర్జింగ్ ఆసియాకప్ (Emerging AsiaCup) రెండో సెమీఫైనల్లో భారత్(Bharath) 'ఏ' ఓటమి పాలైంది. శుక్రవారం ఒమన్ వేదికగా జరిగిన సెమీఫైనల్ లో అఫ్గనిస్థాన్(Afghanistan)‘ఏ’ జట్టు 20 పరుగుల తేడాతో టీంఇండియాపై గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గన్ జట్టు 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే నష్టపోయి 206 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 'ఏ' జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ ఓపెనర్లు సెదికుల్లాహ్ అటల్(83), జుబైద్ అక్బరీ(64)లు చెలరేగడంతో సునాయాసంగా స్కోర్ రెండు వందలు దాటింది. భారత జట్టులోని రమన్ దీప్ సింగ్ (64), ఆయుష్ బదొని (31), నిశాంత్ సింధు (23) పరుగులు చేసినప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేక పోయారు. అత్యంత కీలక సమయంలో అల్లాహ్ ఘజన్ ఫర్ 2 వికెట్లు, అబ్దుల్ రహమాన్ 2 వికెట్లు తీసి భారత్ ను ఓటమిపాలు చేశారు.