INDvsAUS: దంచికొట్టిన కుర్రాళ్లు.. ఉత్కంఠ మ్యాచ్‌లో ఆసీస్‌పై గెలుపు

వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆసిస్ నిర్ధేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయినా సులువుగా చేధించింది.

Update: 2023-11-23 17:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠ టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆసిస్ నిర్ధేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయినా చేధించింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ 50 బంతుల్లో 110 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. తన టీ20 కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఇంగ్లిష్‌తో పాటు స్టీవ్ స్మిత్ 52 పరుగులు చేశాడు. ఆ తర్వాత టీమ్ డెవిడ్ ఒక సిక్స్, రెండు ఫోర్లతో మెరుపు ఇన్సింగ్స్ ఆడి 19 పరుగులు చేశాడు. మొత్తంగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. స్మిత్ రనౌట్‌గా పెవిలియన్ చేరాడు.

అనంతరం 209 పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన టీమిండియా మొదట్లో తడబడింది. ఓపెనర్లు ఇద్దరు స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. తర్వాత ఇషాన్ కిషన్(58), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(80) పరుగులతో ఆసిస్ బౌలర్లపై రెచ్చిపోయారు. అనంతరం ఇద్దరు ఔట్ అవగా.. చివర్లో రింకూ సింగ్(28) ఒంటరి పోరాటం చేసి జట్టుకు విజయాన్ని అందించారు. మొత్తంగా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి భారత్ ఘన విజయం సాధించింది.

Tags:    

Similar News