టీమ్ ఇండియా ప్రాక్టీస్.. కెప్టెన్ రోహిత్, కోహ్లీ దూరం

ఆసియా కప్‌‌లో భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి ఎదురుపడబోతున్నాయి.

Update: 2023-09-07 17:16 GMT

కొలంబో : ఆసియా కప్‌‌లో భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి ఎదురుపడబోతున్నాయి. గ్రూపు దశలో ఇరు జట్లు పోటీపడగా.. ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. అయితే, సూపర్-4 రౌండ్‌లో భాగంగా భారత్, పాక్ జట్లు ఆదివారం తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. గురువారం కొలంబోలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీగా దూరంగా ఉండగా.. మిగతా ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు.

గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ తిరిగి జట్టుతో కలిశాడు. ఆసియా కప్ జట్టులో భాగమైన అతను ఫిట్‌నెస్ సమస్యతో గ్రూపు మ్యాచ్‌లకు దూరంగా ఉండగా.. సూపర్-4 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో నెట్స్‌లో చాలా సేపు చెమటోడ్చాడు. అలాగే వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్‌‌ ప్రాక్టీస్ చేశారు. సూర్యకుమార్, శార్దూల్ ఠాకూర్‌కు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పలు సూచనలు చేశాడు.


Similar News