పాకిస్తాన్‌లో ఆడాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన టీమిండియా ప్లేయర్

ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గర పడుతున్న వేళ టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ అనుమతి ఇస్తే పాకిస్తాన్‌లో జరుగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతామని అన్నారు.

Update: 2024-08-27 12:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గర పడుతున్న వేళ టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ అనుమతి ఇస్తే పాకిస్తాన్‌లో జరుగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతామని అన్నారు. తాము కేవలం ఆటగాళ్లమని.. ఏ దేశానికి పంపినా వెళ్లి ఆడి వస్తామని అన్నారు. ఇంతకుముందు ఎన్నడూ తాను పాకిస్తాన్‌కు వెళ్లలేదు. అందుకే ఈ టూర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని కుల్దీప్ తెలిపారు.

మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లబోదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. టీమిండియాకు ప్రత్యామ్నాయ వేదికలు చూపించాలని ఐసీసీని కోరింది. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది జరిగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీని రీ షెడ్యూల్ చేస్తున్నట్లు ఐసీసీపై వచ్చిన వార్తలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఖండించింది. ప్రత్యేకంగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసమే పాకిస్తాన్‌లోని కరాచీ, రావల్పిండి, గడాఫీ మైదానాలను ఆధునీకరిస్తున్నామని తెలిపింది. 2025లో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరుగతుందని ముందుగా ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్‌లో పేర్కొంది.


Similar News