INDW vs NZW: ఫలించని రాధా యాదవ్ పోరాటం.. చివరకు న్యూజిలాండ్ విజయం

భారత మహిళా(INDW), న్యూజిలాండ్( NZW) మహిళా జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్(ODI series) జరుగుతోంది.

Update: 2024-10-27 15:39 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత మహిళా(INDW), న్యూజిలాండ్( NZW) మహిళా జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్(ODI series) జరుగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం రెండో వన్డే గుజరాత్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచులో భారత్ బౌలర్ రాధా యాదవ్(Radha Yadav) చివరి వరకు పోరాటం చేసింది. అయినప్పటికి న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. కాగా ఈ మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్(New Zealand) మొదట బ్యాటింగ్ చేసింది. సుజియా బ్యాట్స్ 58, జార్జియా ప్లిమ్మర్ 41, సోఫీ డివైన్ 79, మడ్డీ గ్రీన్ 42, మడ్డీ గ్రీన్ 12 పరుగులతో రాణించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ (New Zealand) జట్టు 9 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. అనంతరం 260 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత జట్టుకు మొదటి నుంచి కష్టాలు ఎదురయ్యాయి. టాప్ ఆర్డర్ ఒక్కొక్కరుగా తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో భారత్ ఓటమి ఖాయం అయింది.

ఈ సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన రాధా యాదవ్(Radha Yadav), సైమా ఠాకూర్(Saima Thakur) న్యూజిలాండ్ (New Zealand) బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఎనిమిదో వికెట్ కు ఏకంగా 70 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన ఇద్దరు ఓ సందర్భంలో మ్యాచ్ గెలిపిస్తారేమో ఆనే ఆలోచన తీసుకొచ్చారు. చివరకు సైమా 29 పరుగులు వద్ద అవుట్ కావడం, ఆ తర్వాత 47.1 ఓవర్లకు రాధా యాదవ్ కూడా అవుట్ 48 పరుగుల వద్ద అవుట్ అయింది. ఈ మ్యాచులో మొత్తం 47.1 ఓవర్లకు భారత్ (India) 183 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ జట్టు 79 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచుల వన్డే సిరీస్ ను 1-1 తో సమం చేసుకుంది. ఈ నెల 29న జరిగే మూడో వన్డే (Third ODI)లో గెలిచిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకోనున్నారు.


Similar News