షారుక్ ఖాన్, సునీల్​ నరైన్​ ఊచకోత.. టీ20ల్లో విధ్వంసం​!

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్​ 2023లో విండీస్ ఆల్​రౌండర్ సునీల్​ నరైన్ బ్యాట్​తో చెలరేగాడు.​

Update: 2023-07-03 10:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్​ 2023లో విండీస్ ఆల్​రౌండర్ సునీల్​ నరైన్ బ్యాట్​తో చెలరేగాడు.​మరోవైపు తమిళనాడు ప్రీమియర్​ లీగ్​లో కోవై కింగ్స్ జట్టు కెప్టెన్ షారుక్ ఖాన్ మెరుపు అర్ధ శతకం బాదాడు. ఇంగ్లాండ్ వేదికగా జరగుతున్న టీ20 బ్లాస్ట్​ లీగ్​లో విండీస్ ఆల్​రౌండర్ సునీల్ నరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆదివారం ఎసెక్స్​తో జరిగిన మ్యాచ్​లో రెచ్చిపోయాడు. 37 బంతుల్లోనే 78 పరుగులు చేయగా.. ఈ ఇన్నింగ్స్​లో 6 సిక్సర్లు, 7 ఫోర్లు బాదాడు. బౌండరీల ద్వారానే నరైన్ 64 పరుగులు సాధించాడు. అతడి విధ్వసంతో సర్రె జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.

మరోవైపు తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా ఆదివారం మధురై పాంథర్స్​, కోవై కింగ్స్ జట్లు తలపడగా.. ఈ మ్యాచ్​లో కోవై కింగ్స్ జట్టు కెప్టెన్ షారుక్ ఖాన్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (23 బంతుల్లో 53 : 6x4, 3x6) చేశాడు. బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో నిర్ణిత 20 ఓవర్లలో కోవై కింగ్స్​ 208 పరుగులు చేసింది. అటు బౌలింగ్​లోనూ ఆల్​ రౌండ్ ప్రదర్శన కనబర్చి.. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశాడు. మధురై 164 పరుగులకే ఆలౌట్​ అయ్యింది. దీంతో కోవైకింగ్స్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.


Similar News