పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకం
పారిస్ ఒలిపిక్స్‌లో భారత్ కు మరో పతకం వచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం జరిగిన పురుషుల సింగిల్స్ 50 మీటర్స్ ఈవెంట్ ఫైనల్ జరిగింది.
దిశ, వెబ్ డెస్క్: పారిస్ ఒలిపిక్స్‌లో భారత్ కు మరో పతకం వచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం జరిగిన పురుషుల సింగిల్స్ 50 మీటర్స్ ఈవెంట్ ఫైనల్ జరిగింది. ఇందులో భారత ప్లేయర్ స్వప్నిల్ కుసలే కాంస్య పతకం సాధించాడు. బుధవారం జరిగిన పురుషుల రైఫిల్ 50 మీటర్ల 3పి ఈవేంట్‌లో స్వప్నిల్ కుసలే తన 60 షాట్‌లలో 590 పాయింట్లతో 38 ఇన్నర్ 10లతో ముగించాడు. దీంతొ ఏడో స్థానం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించాడు. అనంతరం నేడు జరిగిన ఫైనల్ మ్యాచుల్ స్వప్నిల్ కుసాలే మూడో స్థానంతో భారత్‌కు మరో కాంస్య పతకాన్ని అందించాడు. కుసాలే మొత్తం స్కోరు 451.4తో ముగించగా, ఉక్రెయిన్‌కు చెందిన సెర్హి కులిష్ 461.3తో రజతం సాధించాడు. 463.6 పాయింట్లతో టాప్‌లో ఉన్న చైనీస్ యుకున్ లియు గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో భారత్ ఖాతాలో మూడు కాంస్య పతకాలు చేరగా.. మూడింటికి మూడు.. షూటింగ్ విభాగంలోనే రావడం విశేషం.