గుజరాత్ టైటాన్స్ యువ సంచలనం కీలక నిర్ణయం..!
గుజరాత్ టైటాన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్ తొలి సారి ఇంగ్లండ్ కౌంటీల్లో అడనున్నాడు.
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ టైటాన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తొలి సారి ఇంగ్లండ్ కౌంటీల్లో అడనున్నాడు. ఇంగ్లీష్ క్రికెట్ క్లబ్ సర్రేతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతడు కౌంటీ ఛాంపియన్షిప్-2023లో ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో సర్రే తరఫున ఆడనున్నాయి. అయితే టామ్ లాథమ్, విల్ జాక్స్ , సామ్ కర్రాన్ వంటి సర్రే ఆటగాళ్లు తమ జాతీయ జట్టు విధుల కారణంగా ఆఖరి కౌంటీ మ్యాచ్‌లకు అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్ సర్రే తరఫున ఇంగ్లండ్ కౌంటీల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది.
సాయి సుదర్శన్ ప్రస్తుతం అధ్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌తో పాటు తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో దుమ్మురేపాడు. అలాగే ఎమర్జింగ్ ఆసియాకప్‌లో కూడా సాయి అదరగొట్టాడు. వైట్‌బాల్ క్రికెట్లో అదరగొడుతున్న సుదర్శన్.. రెడ్‌బాల్ క్రికెట్లో కూడా తన టాలెంట్‌ను నిరూపించుకోవడానికి సిద్దమయ్యాడు. ఈ క్రమంలో సర్రే క్రికెట్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటివరకు 8 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్.. 42.71 సగటుతో 598 రన్స్ చేశాడు.