Suresh Raina: మెగా వేలంలో రికార్డ్ బిడ్ అతడిపైనే.. సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు
సౌదీ అరేబియా (Saudi Arabia)లోని జెడ్డా (Jeddah) వేదికగా ఐపీఎల్ (IPL) మెగా వేలానికి సర్వం సిద్ధమైంది.
దశ, వెబ్‌డెస్క్: సౌదీ అరేబియా (Saudi Arabia)లోని జెడ్డా (Jeddah) వేదికగా ఐపీఎల్ (IPL) మెగా వేలానికి సర్వం సిద్ధమైంది. నవంబర్ 24, 25 తేదీల్లో జరిగిన ఈ మెగా ఆక్షన్ కోసం క్రికెట్ లవర్స్ (Cricket Lovers) నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. భారత కాలమాన ప్రకారం నవంబర్ 24న, మధ్యాహ్నం 3 గంటలకు వేలంపాట ప్రారంభం కానుంది. ఈ మెగా ఆక్షన్ (Mega Action)లో వేలానికి మొత్తం ఇప్పటి వరకు 1,574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. అందులో ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ (BCCI) 574 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. అందులో 204 మంది ఆటగాళ్లను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయనున్నాయి. అందులో 70 మంది విదేశీ ఆటగాళ్లు (Foreign Players) ఉన్నారు.
ఈ క్రమంలో మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయే ఆటగాడు ఎవరో భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా (Suresh Raina) అప్పుడే తేల్చేశాడు. టీమిండియా (Team India) వికెట్ కీపర్, స్టార్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) కోసం ఫ్రాంచైజీలు ఎగబడటం ఖాయమని జోస్యం చెప్పాడు. ఈ మేరకు వేలంలో ఫ్రాంచైజీలు (Franchises) అతడిపై రూ.25 కోట్లు నుంచి రూ.30 కోట్లు వరకు బిడ్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు. అదేవిధంగా కేఎల్ రాహుల్ (KL Rahul), శ్రేయస్ అయ్యర్ (Shreyas Ayyar)లు కూడా భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉందని అన్నాడు. ముఖ్యంగా భారత కెప్టెన్ల కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఫ్రాంచైజీలు వేట మొదలు పెట్టాయని సురేష్ రైనా తెలిపాడు.