పాక్ జర్నలిస్ట్ నోరు మూయించిన రైనా.. అసలేం జరిగిందంటే?

తనను ట్రోల్ చేసేందుకు చూసిన పాకిస్తాన్ జర్నలిస్ట్‌కు భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా గట్టి సమాధానమిచ్చాడు.

Update: 2024-05-24 14:05 GMT

దిశ, స్పోర్ట్స్ : తనను ట్రోల్ చేసేందుకు చూసిన పాకిస్తాన్ జర్నలిస్ట్‌కు భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా గట్టి సమాధానమిచ్చాడు. అసలేం జరిగిందంటే.. త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిని ఐసీసీ అంబాసిడర్‌గా నియమించింది. ఈ విషయంలో పాక్ జర్నలిస్ట్ ఇమ్రాన్ సిద్దిఖ్.. రైనాను ఎగతాళి చేయాలని చూశాడు. ‘టీ20 వరల్డ్ కప్‌కు షాహిద్ అఫ్రిదిని ఐసీసీ అంబాసిడర్‌గా నియమించింది. హలో సురేశ్ రైనా నువ్వు ఎక్కడ?’ అంటూ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశాడు.

దీనికి రైనా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ‘నేను ఐసీసీ అంబాసిడర్ కాదు. కానీ, 2011 వరల్డ్ కప్ గెలిచాను. మొహాలీ గేమ్ గుర్తుందా? ఆ మ్యాచ్ నీకు మరిచిపోలేని జ్ఞాపకాలను గుర్తు చేస్తుందనుకుంటా?’ అని ట్వీట్ చేసి పాక్ జర్నలిస్ట్ నోరు మూయించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో పాక్‌పై 29 పరుగుల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించింది. అప్పుడు పాక్ కెప్టెన్‌ షాహిద్ అఫ్రిది. ఆ మ్యాచ్‌లో రైనా 36 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇదే విషయాన్ని రైనా పాక్ జర్నలిస్ట్‌కు గుర్తు చేసి మళ్లీ నోరెత్తకుండా చేశాడు. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించిన భారత్ వన్డే వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.కాగా, వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌కు యువరాజ్ సింగ్, క్రిస్ గేల్, ఉసెన్ బోల్ట్, షాహిద్ అఫ్రిదిలను అంబాసిడర్లుగా నియమించింది.

Tags:    

Similar News