Sunil Gavaskar : పింక్ బాల్ టెస్ట్‌లో ఆ ఇద్దరు భారత ప్లేయర్లకు నో చాన్స్!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్‌ గెలిచిన భారత్ అదే ఊపును రెండో టెస్టులోనూ కొనసాగించాలని భావిస్తోంది.

Update: 2024-12-01 13:10 GMT

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్‌ గెలిచిన భారత్ అదే ఊపును రెండో టెస్టులోనూ కొనసాగించాలని భావిస్తోంది. రెండో టెస్ట్‌లో పింక్ బాల్‌తో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌‌లో మూడు మార్పులతో భారత్ బరిలోకి దిగనున్నట్లు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అంచనా వేశాడు. ఈ నెల 6 నుంచి అడిలైడ్‌లో జరగనున్న పింక్ బాల్ టెస్ట్‌లో భారత్ ప్లేయింగ్ 11లో మూడు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు ఆయన తెలిపాడు. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో లీడ్‌లో కొనసాగుతోంది. అడిలైడ్ ఓవల్‌లో జరిగే మ్యాచ్‌లో దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ స్థానంలో రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ జట్టులోకి తిరిగివస్తారని గవాస్కర్ అన్నారు. తొలి టెస్టులో ఓపెనింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్ రోహిత్ రాకతో మిడిల్ అర్డర్‌లో దిగనున్నట్లు ఆయన తెలిపారు. రెండు మార్పులు ఖచ్చితంగా ఉంటాయని గవాస్కర్ అన్నారు. ‘బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు ఉంటాయి. రాహుల్ స్థానంలో రోహిత్ ఓపెనింగ్ బ్యాటింగ్‌కు దిగుతాడు. గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ దిగుతాడు. పడిక్కల్, జురెల్‌లను జట్టు నుంచి తప్పించడం ఖాయం. దీంతో కే.ఎల్ రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగుతాడు. వాషింగ్ టన్ సుందర్ స్థానంలో రవీంద్ర జడేజాను ఆడించాలి.’ అని గవాస్కర్ అన్నాడు.

Tags:    

Similar News