బెంగళూరు ఓపెన్‌లో క్వార్టర్స్‌కు సుమిత్

బెంగళూరు ఓపెన్‌ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ సుమిత్ నాగల్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు.

Update: 2024-02-15 18:08 GMT

దిశ, స్పోర్ట్స్ : బెంగళూరు ఓపెన్‌ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ సుమిత్ నాగల్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో సుమిత్ 6-2, 7-5 తేడాతో హాంకాంగ్ ఆటగాడు కోల్‌మాన్ వాంగ్‌పై విజయం సాధించాడు. గంటా 45 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన సుమిత్ వరుస సెట్లలో మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. తొలి సెట్‌ను అలవోకగా నెగ్గిన అతనికి రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. నువ్వానేనా అన్నట్టు సాగిన రెండో సెట్‌లో సుమిత్ రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసి పైచేయి సాధించాడు. ఒక దశలో ఇద్దరు 5-5తో నిలువగా సెట్ టై బ్రేకర్‌కె వెళ్లాలా కనిపించింది. అయితే, 11వ గేమ్‌లో సర్వీస్‌ను కాపాడుకున్న సుమిత్.. 12వ గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి విజేతగా నిలిచాడు. నేడు క్వార్టర్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ ఆడమ్ వాల్టన్‌తో సుమిత్ తలపడనున్నాడు. ఇక, పురుషుల డబుల్స్‌లో భారత జంట రామ్‌కుమార్ రామనాథన్-సాకేత్ మైనేని సెమీస్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రామ్‌కుమార్, సాకేత్ 6-4 , 6-4 తేడాతో జర్మనీకి చెందిన జాకబ్-మార్క్ వాల్నర్ జోడీపై విజయం సాధించింది. నేడు సెమీస్‌లో ఫ్రాన్సిస్ అల్కాంటారా(ఫిలిప్పీన్స్)-కైచి ఉచిడా(జపాన్) జోడీని భారత ద్వయం ఎదుర్కోనుంది. 

Tags:    

Similar News