ఆసియా ట్రామ్‌పోలెన్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో సృష్టి చరిత్ర

ఆసియా ట్రామ్‌పోలెన్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి సృష్టి ఖండగాలే చరిత్ర సృష్టించింది.

Update: 2024-05-13 13:14 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆసియా ట్రామ్‌పోలెన్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి సృష్టి ఖండగాలే చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. హాంకాంగ్‌లో ఆదివారం రాత్రి జరిగిన టోర్నీలో ఆమె వ్యక్తిగత ట్రామ్‌పోలెన్ ఏజ్ గ్రూపు ఈవెంట్‌లో రజత పతకం దక్కించుకుంది. ఫైనల్‌లో సృష్టి 39.150 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. కజకిస్తాన్ క్రీడాకారిణి డోల్గోపోలోవా(46.170 స్కోరు) స్వర్ణం సాధించగా.. హాంకాంగ్‌కు చెందిన హంగ్(38.140 స్కోరు) కాంస్యం గెలుచుకుంది. 

Tags:    

Similar News