సిరీస్ శ్రీలంకదే.. రెండో టెస్టులో బంగ్లాపై ఘన విజయం

Update: 2024-04-03 14:26 GMT

దిశ, స్పోర్ట్స్: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులోనూ పర్యాటక శ్రీలంక జట్టే విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను లంక కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్ నైట్ స్కోరు 268/7తో చివరి రోజైన బుధవారం ఆట ప్రారంభించిన బంగ్లా.. మరో 50 పరుగులు మాత్రమే చేసి 318 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో 192 పరుగుల తేడాతో శ్రీలంక భారీ విజయం సాధించింది. మిరాజ్ (81 నాటౌట్) ఒక్కడే చివరివరకు పోరాడినా మరో ఎండ్ నుంచి అతనికి మద్దతు లభించలేదు. కాగా, గత నెల 30 నుంచి ప్రారంభమైన రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కుసల్ మెండిస్(93), కమిండు మెండిస్(92 నాటౌట్), కరుణరత్న(86), ధనుంజయ డిసిల్వా(70), చండిమల్(59), నిషాన్ మదుష్క(57)లు అదరగొట్టడంతో తొలి ఇన్నింగ్స్‌లో 531 పరుగుల భారీ స్కోరు సాధించింది. బంగ్లా మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శ్రీలంకకు 353 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో మరో 157/7 పరుగులు జోడించి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో మాథ్యూస్(56) రాణించాడు. మొత్తంగా 510 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్.. చివరి రోజు 318 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. రెండు టెస్టుల్లోనూ అదరగొట్టిన శ్రీలంక బ్యాటర్ కమిండు మెండిస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ పర్యటనను శ్రీలంక విజయవంతంగా ముగించుకుంది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తో, టెస్టు సిరీస్‌ను 2-0తో దక్కించుకుంది. వన్డే సిరీస్ మాత్రం 2-1తో ఆతిథ్య బంగ్లాదేశ్ దక్కించుకుంది.

slug: Sri Lanka wrap up 192-run win to complete series sweep

Tags:    

Similar News