Sachithra Senanayake: మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం.. శ్రీలంక వరల్డ్‌కప్‌ విన్నర్‌ అరెస్టు!

శ్రీలంక మాజీ క్రికెటర్‌ సచిత్ర సేననాయకే మ్యాచ్ ఫిక్సింగ్ వివాదాల్లో చిక్కుకున్నాడు.

Update: 2023-09-06 11:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక మాజీ క్రికెటర్‌ సచిత్ర సేననాయకే మ్యాచ్ ఫిక్సింగ్ వివాదాల్లో చిక్కుకున్నాడు. అతడిపై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. బుధవారం శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ దర్యాప్తు బృందానికి లొంగిపోయాడు. అనంతరం దర్యాప్తు బృందం అతడిని అరెస్ట్ చేసింది. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఇదివరకే దర్యాప్తు ప్రారంభించిన కొలంబో కోర్టు.. మూడు వారాల కిందటే అతడిపై ప్రయాణ నిషేధాన్ని విధించింది. కాగా శ్రీలంక క్రికెట్‌ చరిత్రలోనే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ సంబంధించి న్యాయ విచారణకు హాజరకానున్న మొదటి క్రికెటర్‌ సేనానాయకే కావడం గమనార్హం.

లంక ప్రీమియర్‌ లీగ్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌..

సేనానాయకే.. లంక ప్రీమియర్ లీగ్ 2020 మ్యాచ్‌ల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి ఇద్దరు ఆటగాళ్లను సేనానాయకే టెలిఫోన్‌లో సంప్రదించినట్లు పలు రిపోర్టులు వెల్లడించాయి. దీంతో అతడు విదేశాలకు వెళ్లకుండా మూడు నెలల పాటు ట్రావెల్‌బ్యాన్‌ కొలంబోలోని స్ధానికి కోర్టు విధించింది. ఈ ‍క్రమంలో సేనానాయకేనే ప్రత్యేక దర్యాప్తు విభాగం ముందు లొంగిపోయాడు. 28 ఏళ్ల సేనానాయకే శ్రీలంక తరఫున 49 వన్డేలు, 24 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు.


Similar News