SL vs NZ : వన్డే సిరీస్ ట్రోఫీ శ్రీలంక సొంతం
స్వదేశంలో చెలరేగి ఆడుతున్న శ్రీలంక (Srilanka) మరో వన్డే సిరీస్ పట్టేసింది.
దిశ, వెబ్ డెస్క్ : స్వదేశంలో చెలరేగి ఆడుతున్న శ్రీలంక (Srilanka) మరో వన్డే సిరీస్ పట్టేసింది. వర్షం కారణంగా మంగళవారం న్యూజిలాండ్ (Newzealand)తో పల్లెకెలె స్టేడియంలో జరగుతున్న మూడో వన్డే రద్దు అయింది. దాంతో, వరుసగా రెండు వన్డేల్లో గెలుపొందిన లంక 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. 21 ఓవర్ ముగిశాక మొదలైన వాన తగ్గకపోవడంతో.. రిఫరీలు ఇరుజట్ల కెప్టెన్లతో మాట్లాడి మ్యాచ్‌ను రద్దు చేసి.. శ్రీలంక కెప్టెన్ చరిత అసలంకకు ట్రోఫీ అందించారు. కుశాల్ మెండిస్ (Kushal Mendis) ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు. టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌ను వైట్‌వాష్ చేసిన శ్రీలంక పొట్టి, వన్డే సిరీస్‌లను సైతం కైవసం చేసుకుంది.