గంభీర్ ప్రశాంతంగా ఉండు.. టీమిండియా హెడ్ కోచ్‌కు హర్భజన్ సింగ్ సూచన
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక సూచన చేశాడు.
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక సూచన చేశాడు. భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేయాలంటే గంభీర్ ప్రశాంతంగా ఉండాలని సూచించాడు. ఓ ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ..‘పెద్ద జట్లకు కోచ్‌గా ఉండటం కష్టమే. ఎవరికైనా సమయం పడుతుంది.ఆస్ట్రేలియాతో సిరీస్ చాలా కీలకం. చాలా విషయాలు పరీక్షగా నిలుస్తాయి. గంభీర్ కోపం, సహనాన్ని కూడ ఈ సిరీస్ పరీక్షిస్తుంది. అతను చాలా విషయాలను నియంత్రించుకోలేదు. అలాంటప్పుడు పెద్ద ప్లేయర్లు విసుగుచెందుతారు. ఈ టెస్టును గంభీర్ పాస్ కావాలి. గంభీర్‌కు ఈ పర్యటన చాలా కీలకం. ఇప్పుడు అందరి దృష్టి అతనిపైనే ఉంది. ఆసిస్ గడ్డపై భారత్ రాణించకపోతే గంభీర్ విమర్శలు ఎదుర్కొంటాడు. కాబట్టి, గంభీర్ ప్రశాంతంగా ఉండాలని, జట్టు బాగా ఆడాలని కోరుకుంటున్నా.’ అని తెలిపాడు.