Danushka Gunathilaka: అత్యాచార కేసులో నిర్దోషిగా.. నేషనల్​ టీమ్‌కు రీ ఎంట్రీ ఇవ్వనున్న లంక క్రికెటర్

శ్రీలంక క్రికెటర్​దనుష్క గుణతిలక త్వరలో నేషనల్ క్రికెట్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

Update: 2023-10-17 09:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక క్రికెటర్​దనుష్క గుణతిలక త్వరలో నేషనల్ క్రికెట్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అత్యాచార వేధింపుల కేసు కారణంగా అతనిపై విధించిన నిషేధాన్ని తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు ఎత్తివేసింది. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా క్రికెట్ శ్రీలంక క్లారిటీ ఇచ్చింది.

"ఆస్ట్రేలియాలో దనుష్క గుణతిలకపై వేసిన నేరారోపణలను దర్యాప్తు చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు స్వతంత్ర విచారణ కమిటీ.. నవంబర్ 2022లో గుణతిలకపై విధించిన నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేయాలని సిఫార్సు చేసింది. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌లో దాఖలు చేసిన అన్ని అభియోగాల నుంచి విముక్తి పొందిన అతను.. ఇప్పుడు నేషనల్ టీమ్‌లోకి తిరిగి రాగలడు." అంటూ క్రికెట్​ బోర్డు పేర్కొంది.

అసలేం జరిగిందంటే..

లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో శ్రీలంక క్రికెటర్‌ గుణతిలకను గతేడాది నవంబర్‌లో సిడ్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ' కొంతకాలం క్రితం గుణతిలకకు ఆన్‌లైన్​లో ఓ 29 ఏళ్ల మహిళ పరిచయమైంది. వీరిద్దరూ నవంబర్‌ 2న రోజ్‌ బే లోని ఓ హెటల్‌ గదిలో మీట్ అయ్యారు. ఆ తర్వాత అతడు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు' అంటూ పోలీసులు దనుష్కపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసు పెట్టిన మహిళ కూడా తనను గుణతిలక బలవంత చేయబోయాడని, ముద్దు కూడా పెట్టబోయాడని ఆరోపించింది. అయితే విచారణ సమయంలో మాత్రం రెండు రకాలుగా వాదనలు వినిపించింది. దీంతో న్యాయమూర్తి.. గుణతిలకకు అనుకూలంగా తీర్పును ఇచ్చారు.


Similar News