డబ్ల్యూటీటీ ఫీడర్ టైటిల్ నెగ్గిన తెలుగమ్మాయి శ్రీజ

భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, తెలుగమ్మాయి ఆకుల శ్రీజ అంతర్జాతీయ వేదికపై అదరగొట్టింది.

Update: 2024-03-24 17:35 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, తెలుగమ్మాయి ఆకుల శ్రీజ అంతర్జాతీయ వేదికపై అదరగొట్టింది. లెబనాన్‌లో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్(డబ్ల్యూటీటీ) ఫీడర్ బీరుట్ టోర్నీలో ఉమెన్స్ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో శ్రీజ 3-1(6-11, 12-10, 11-5, 11-9) తేడాతో సారా డి నట్టే(లక్సెంబర్గ్)పై విజయం సాధించింది. తొలి గేమ్‌ కోల్పోయిన తర్వాత అద్భుతంగా పుంజుకున్న శ్రీజ వరుసగా మూడు గేమ్‌ల్లో గెలిచి విజేతగా నిలిచింది. ఉమెన్స్ డబుల్స్‌లో శ్రీజ జోడీ రన్నరప్‌గా సరిపెట్టింది. ఫైనల్‌లో శ్రీజ-దియా పరాగ్ జంట 3-1 తేడాతో ఝు చెంగ్జు-డూ హోయి కెమ్(హాంకాంగ్)జోడీ చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆకాశ్ పాల్-పోమంటి బైస్యా, మెన్స్ డబుల్స్‌లో మానవ్ వికాస్-మానుష్ జంటలు విజేతలుగా నిలిచాయి. 

Tags:    

Similar News