తెలంగాణ ప్యాడ్లర్ శ్రీజ జోరు.. కెరీర్ బెస్ట్ వరల్డ్ ర్యాంక్ కైవసం

కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న తెలుగమ్మాయి, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించింది.

Update: 2024-06-25 13:31 GMT

దిశ, స్పోర్ట్స్ : కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న తెలుగమ్మాయి, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించింది. తాజాగా ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్(ఐటీటీఎఫ్) రిలీజ్ చేసిన వరల్డ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా టాప్-25లోకి అడుగుపెట్టింది. ఉమెన్స్ సింగిల్స్‌లో శ్రీజ 19 స్థానాలు ఎగబాకి వరల్డ్ నం.24 ర్యాంక్‌కు చేరుకుంది.ఇటీవల లాగోస్‌లో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలో శ్రీజ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె భారీగా పాయింట్స్ మెరుగుపర్చుకుంది.

దీంతో వరల్డ్ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి శ్రీజ టాప్ ర్యాంక్ పొందింది. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న మనికా బాత్రా‌ను అధిగమించింది.మనికా బాత్రా ఒక్క స్థానం కోల్పోయి 29వ ర్యాంక్‌కు పడిపోయింది. ఐహికా ముఖర్జీ 48 స్థానాలు ఎగబాకి 92వ స్థానంలో నిలిచింది. లాగోస్ టోర్నీలో ఉమెన్స్ డబుల్స్ టైటిల్ గెలిచిన శ్రీజ-అర్చన జోడీ ఏకంగా 109 స్థానాలు అధిగమించి 44వ ర్యాంక్‌కు చేరుకుంది. మెన్స్ సింగిల్స్‌లో స్టార్ ఆటగాడు శరత్ కమల్ ఐదు స్థానాలు అధిగమించి 39వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. 


Similar News