సూపర్ కింగ్స్ జట్టులోకి సౌతాఫ్రికన్ ప్లేయర్.. ఎవరో తెలుసా?
ఐపీఎల్ 2023కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఊహించని మార్పు చోటుచేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2023కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఊహించని మార్పు చోటుచేసుకుంది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీసన్ స్థానంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ సిసంద మగలను జట్టులోకి తీసుకున్నారు. కైల్ జేమీసన్ గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన కైల్ జేమిసన్ 2022 జూన్‌లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇంగ్లండ్‌తో ఆడిన ఆ టెస్ట్ మ్యాచ్‌లో కైల్ జేమీసన్ వెన్ను గాయానికి గురయ్యాడు. దీంతో అతను శస్త్ర చికిత్స కారణంగా దాదాపు నాలుగు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. కైల్ జేమీసన్‌ను 2022లో జరిగిన మినీ వేలంలో రూ. కోటి చెల్లించి చెన్నై కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
సిసంద మగల కెరీర్ ఇలా..
సిసంద మగల దక్షిణాఫ్రికా తరఫున ఇప్పటివరకు మొత్తం ఐదు వన్డేలు, నాలుగు టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. సిసంద మగల వన్డేల్లో ఆరు వికెట్లు, అంతర్జాతీయ టీ20ల్లో మూడు వికెట్లను తీసుకున్నాడు. ఇది కాకుండా అతను ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మొత్తం 127 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 23.95 సగటుతో 136 వికెట్లు తీసుకున్నాడు.