అప్గాన్ ‘ఖేల్’ ఖతం.. సౌతాఫ్రికా విజయం

దిశ, స్పోర్ట్స్ : తొలిసారి సెమీస్‌కు చేరి ఇంకొక అడుగు వేస్తే వరల్డ్ కప్‌ను ముద్దాడుతామనుకున్న అప్గానిస్తాన్ జట్టు కల చెదిరింది.

Update: 2024-06-27 17:09 GMT

దిశ, స్పోర్ట్స్ : తొలిసారి సెమీస్‌కు చేరి ఇంకొక అడుగు వేస్తే వరల్డ్ కప్‌ను ముద్దాడుతామనుకున్న అప్గానిస్తాన్ జట్టు కల చెదిరింది.టీ20 వరల్డ్ కప్‌లో భాగంలో గురువారం ఉదయం 6 గంటలకు అప్గానిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది.ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అప్గాన్ జట్టు మ్యాచ్ ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే దారుణంగా విఫలమైంది. ట్రినాడాడ్ వేదికగా జరిగిన మ్యాచులో సఫారీ బౌలర్లు చెలరేగి పోగా కాబూలీ జట్టు దారుణంగా మట్టికరిసింది.

56 పరుగులకే ఆలౌట్..

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అప్గాన్ జట్టు అతి తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యి చెత్త అతి రికార్డును మూటగట్టుకుంది. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే అప్గాన్ జట్టు ఆటగాళ్లు వెనువెంటనే పెవిలియన్ చేరారు. సఫారీ బౌలర్లలో షంసీ 3/6, జన్‌సేన్ 3/16, రబాడా 2/14, నార్తజే 2/7 విజృంభించడంతో కేవలం 11.5 ఓవర్లలోనే 56 పరుగులకు అప్గాన్ జట్టు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు విఫలమైనా మిడిలార్డర్ జట్టును గాఢీన పెట్టే ప్రయత్నం చేయలేకపోయారు.

అప్గాన్ కల చెదిరే..

టీ20 వరల్డ్ కప్ సూపర్-8 దశలో అద్భుతంగా ప్రదర్శన చేసిన అప్గాన్ జట్టు ఆటగాళ్లు సెమీస్‌లో దారుణంగా విఫలమయ్యారు. కాబూలీ టీం ఆటగాళ్లలో అజ్మతుల్లా 10/12 మినహా అందరూ పది పరుగులలోపే ఔట్ అయ్యారు. ఫలితంగా అప్గాన్ విధించిన అతి స్వల్ప లక్ష్యాన్ని సఫారీ జట్టు 60/1(8.5) ఓవర్లలోనే ఛేదించగా.. అప్గాన్ జట్టుపై 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా టీం ఘనవిజయం సాధించి..గ్రూప్ బి నుంచి ఫైనల్స్‌కు చేరిన తొలిజట్టుగా నిలిచింది. కాగా,గత ఐసీసీ టీ20 టోర్నీల్లో దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్స్‌కు చేరడం ఇదే తొలిసారి. కాగా, రెండో సెమీస్‌లో విజయం సాధించిన జట్టుతో సఫారీ టీం ఫైనల్స్‌లో తలపడనుంది.

ట్రినిడాడ్ పిచ్‌పై అప్గాన్ కోచ్ ఆగ్రహం..

ట్రినిడాడ్ పిచ్ పరమ చెత్తగా ఉండటం వల్లే తాము ఓడిపోయామంటూ అప్గాన్ జట్టు కోచ్ జొనాథన్ ట్రాట్ ఆగ్రహం వ్యక్తంచేశారు.సెమీఫైనల్ వంటి మ్యాచులకు ఇలాంటి పిచ్ సరికాదు. పోటీ న్యాయంగా లేదు. ఇరు జట్లకూ పిచ్ ఇబ్బందిగానే మారిందని విమర్శించారు.

ఇది సమిష్టి విజయం..

సెమీస్‌లో అప్గానిస్తాన్‌పై గెలిచి ఫైనల్స్‌కు చేరడంపై సఫారీ జట్టు కెప్టెన్ మార్‌క్రమ్ స్పందిస్తూ..టీ20 వరల్డ్ కప్ సిరీస్లో తొలిసారి తమ జట్టు ఫైనల్‌కు చేరడం ఆనందంగా ఉంది. తాను కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఈ గెలుపు కేవలం తానొక్కడి వల్లే సాధ్యం కాలేదని,ఇదంతా జట్టు సమిష్టి కృషి వల్లే జరిగిందన్నారు. తెలివైన బౌలింగ్, సరైన బ్యాటింగ్, కఠినమైన పిచ్, అదృష్టం కలిసి రావడంతో విజయం సాధ్యమైందన్నారు.

స్కోర్ బోర్డు :

అప్గానిస్తాన్ జట్టు : (56/11.5 ఓవర్లు)

బ్యాటింగ్ : గుర్బాజ్ 0 (సి) హెడ్రిక్స్ (బి) జన్సేన్, ఇబ్రహీం 2 (బి) రబాడా, గుల్బాదిన్ నయీబ్ 9(బి) జన్సేన్, అజ్మతుల్లా 10 (బి)స్టబ్స్ (బి) నార్తజే, మహమ్మద్ నబీ 0 (బి) రబాడా, కరోటే 2 (ఎల్బీడబ్ల్యూ) జన్‌సేన్, జనత్ 8 (ఎల్బీడబ్ల్యూ) షంసీ, రషీద్ ఖాన్ 8 (బి) నార్తజే, నూర్ అహ్మద్ 0(ఎల్బీ) షంసీ, నవీన్ ఉల్ హక్ 2 (ఎల్బీ) షంసీ, ఫారుఖీ 2 (నాటౌట్), ఎక్స్‌ట్రాలు (13)

వికెట్లపతనం : 4/1,16/2,20/3,20/4,23/5,28/6,50/7,50/8,50/9,56/10

బౌలింగ్ : జన్‌సేన్ (3-0-16-3), కేశవ్ మహరాజ్ (1-0-6-0), రబాడా (3-1-14-2), నార్తజే (3-0-7-2), షంసీ (1.5-0-6-3)

సౌతాఫ్రికా జట్టు : 60/ 1 (8.5 ఓవర్లు)

బ్యాటింగ్ : డికాక్ 5(బి) ఫారుఖీ, హెడ్రిక్స్ 29 (నాటౌట్), అడెన్ మార్ క్రమ్ 23 (నాటౌట్), ఎక్స్‌ట్రాలు- 3

వికెట్ల పతనం : 5/1

బౌలింగ్ : నవీన్ ఉల్ హక్ (3-0-15-0), ఫారుఖీ (2-0-11-1), రషీద్ ఖాన్ (1-0-8-0),ఓమర్ జాయ్ (1.5-0-18-0),గుల్బాదిన్ నయీబ్ (1-0-8-0)


Similar News