Nitish Reddy : నా వల్ల కాదన్నారు.. నిరూపించాలనుకున్నా : నితీశ్ రెడ్డి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి నితీశ్ కుమార్‌ను ఎంపిక చేసినప్పుడు పలువురు అతని సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారు.

Update: 2024-12-29 18:41 GMT

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి నితీశ్ కుమార్‌ను ఎంపిక చేసినప్పుడు పలువురు అతని సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా నాలుగో టెస్టులో నితీశ్ అద్భుతమైన సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించాడు. తాజాగా మీడియాతో నితీశ్ మాట్లాడుతూ..‘కొందరు తనను అనుమానించారు. ఐపీఎల్ నుంచి వచ్చిన కుర్రాడు బిగ్ సిరీస్‌ల్లో రాణించలేడన్నారు. వాళ్లు తప్పని నిరూపించాలనుకున్నా. భారత జట్టుకు 100 శాతం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చానని చెప్పాలనుకున్నా.’ అని వ్యాఖ్యానించాడు. అయితే, ఈ విజయం రాత్రికి రాత్రి వచ్చింది కాదని, మూడేళ్లు కష్టపడ్డానని తెలిపాడు. ‘నా తొలి ఐపీఎల్ సీజన్ తర్వాత నేను బ్యాటింగ్‌లో మెరుగుపడాల్సిన అంశాలను గుర్తించాను. వాటిపై కష్టపడ్డాను. ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయి.’ అని చెప్పుకొచ్చాడు. అలాగే, తన క్రికెట్ కెరీర్ కోసం తన తండ్రి చేసిన త్యాగాలను చెబుతూ నితీశ్ ఎమోషనల్ అయ్యాడు. ‘నన్ను ప్రోత్సహించడానికి మా నాన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. నన్ను నమ్మిన మొదటి వ్యక్తి ఆయనే. ఆయన లాంటి తండ్రి కలిగి ఉండటం అదృష్టం.’ అని తెలిపాడు. సెంచరీని తన తండ్రికి అంకితం చేస్తున్నట్టు చెప్పాడు. 

Tags:    

Similar News