Pak Cricketer: 2 నెలల తర్వాత గుర్తొచ్చిందా అమ్మడూ..! పాక్ క్రికెటర్‌ని ఆడుకుంటున్న నెటిజన్లు
విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మల టీ20 రిటైర్మెంట్‌పై ఓ పోస్ట్ చేసి చిక్కుల్లో పడింది పాకిస్తాన్ మహిళా క్రికెటర్ నిదా దర్.
దిశ, వెబ్‌డెస్క్: విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)ల టీ20 రిటైర్మెంట్ (T20 Retirment)పై సోషల్ మీడియా (Social Media)లో ఓ పోస్ట్ చేసి చిక్కుల్లో పడింది పాకిస్తాన్ మహిళా క్రికెటర్ నిదా దర్ (Pakistan Woman Cricketer Nida Dar). అలాగని ఆమె తన పోస్ట్‌లో విరాట్, రోహిత్‌లపై ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ చేయలేదు. జస్ట్ విష్ చేసిందంతే. అలాగే టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) గెలిచినందుకు కూడా కంగ్రాచ్యులేట్ చేసింది. అదేంటి..? విష్ చేస్తే ఎవరైనా ట్రోల్ (Troll) చేస్తారా..? అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇది నిజం. అయితే దీనికి కారణం ఏంటంటే.. ఆమె పోస్ట్ టైమింగ్. టీమిండియా (Team India) టీ20 వరల్డ్ కప్ గెలిచి, కోహ్లీ, రోహిత్ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి రెండు నెలలు దాటిపోయింది. ఇండియన్ ఫ్యాన్స్ కూడా వాళ్ల టీ20 రిటైర్మెంట్ గురించి మర్చిపోయి టెస్ట్, వన్డేల రికార్డుల గురించి లెక్కలేసుకుంటున్నారు.
ఇలాంటి టైంలో నిదా దర్.. ‘‘టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకి కంగ్రాచ్చులేషన్స్. అలాగే ప్రపంచ క్రికెట్‌కి ఎంతో సేవ చేసిన రోహిత్, కోహ్లీలకి స్పెషల్ విషెస్. మీ నాయకత్వం, ప్రతిభ, నిబద్ధత కోట్లమందికి ఇన్స్‌పిరేషన్. హ్యాపీ రిటైర్మెంట్ లెజెండ్స్. మీక్కుడా శుభాకాంక్షలు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)’’ అని ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. సెప్టెంబర్ 4వ తేదీన ఆమె ఈ పోస్ట్ చేయడంతో మొదట షాక్ అయిన నెటిజన్లు ఎక్స్ (X) వేదికగా ఆమెని విపరీతంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.
‘‘అరెరె.. చాలా ఫాస్ట్‌గా మేల్కొన్నావ్. నువ్వు ముందు నీ పీఆర్‌ని ఉద్యోగంలో నుంచి తీసేసి బాబర్ అజామ్‌ని హైర్ చేసుకో. అతడికి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది ఇలాంటి వాటిలో..’’ అని ఓ నెటిజన్ ట్రోల్ చేయగా..
‘‘దీన్ని బట్టి చూస్తే నిదా దర్ భూమి నుంచి 6 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో నివశిస్తున్నట్లుంది. అందుకే అంత దూరం నుంచి చేసిన ట్వీట్ భూమికి చేరుకోవడానికి 2 నెలల వారం రోజులు పట్టింది.’’ అంటూ మరో యూజర్ ఎగతాళి చేశాడు.
ఇంకో యూజర్ అయితే.. ‘‘నిదా దర్‌ని ఏమీ అనకండి. తప్పు ఆమెది కాదు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఇంటర్నెట్ అంత స్లోగా ఉంది. అందుకే లేట్ అయింది’’ అని ఎక్స్ వేదికగా హేళన చేశాడు.
ఇక ఈ ట్రోలింగ్ తట్టుకోలేక గురువారం (Thursday) నాడు తన పోస్ట్‌ని డిలీట్ చేసింది నిదా దర్. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ (Pakistan) టీ20 జట్టు కెప్టెన్‌గా ఉన్న నిదా దర్ ఈ మధ్యనే తన కెప్టెన్సీ (Captaincy) కోల్పోయింది.