జైస్వాల్ to సచిన్ టెండూల్కర్.. భారీ సిక్సర్లతో మైల్‌స్టోన్ అందుకున్న ఆరుగురు భారత బ్యాటర్లు

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో యువ బ్యాటర్ జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు.

Update: 2024-02-03 05:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో యువ బ్యాటర్ జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. రెండో రోజు ప్రారంభంలోనే జైస్వాల్ భారీ సిక్సర్‌తోసెంచరీని అందుకున్నాడు. దీంతో అతను భారత స్టార్ బ్యాటర్లు అయిన టెండూల్కర్, సెహ్వాగ్, రోహిత్, పంత్, ద్రావిడ్ ల సరసన చేరిపోయాడు. కాగా గతంలో టెండూల్కర్ ఏకంగా ఆరు సార్లు ఇలా సిక్సర్లతో సెంచరీలు పూర్తి చేశాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. మూడు సార్లు ఇలా సిక్సర్లతో సెంచరీలను నమోదు చేశారు. అలాగే గౌతం గంభీర్ , వీరేంద్ర సెహ్వాగ్ లు సిక్సర్లతో వరుసగా రెండు సార్లు తమ మైల్ స్టోన్ స్కోరును అందుకున్నారు. వీరితో పాటుగా యువ బ్యాటర్లు అయిన కేఎల్ రాహుల్ రెండుసార్లు, రిషబ్ పంత్ ఒకసారి భారీ సిక్సర్లతో తమ మూడంకెల స్కోరు మైలురాయిని అందుకున్న వారి జాబితాలో ఉన్నారు.

Tags:    

Similar News