Shubman Gill : చరిత్ర సృష్టించిన టీమిండియా యువ బ్యాటర్
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో దుమ్మురేపిన టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ మరిన్ని రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.
దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో దుమ్మురేపిన టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కివీస్, భారత్ మధ్య డిసైడింగ్ మ్యాచ్‌లో గిల్ 126 పరుగులు చేస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇక, టీ20 మ్యాచ్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన ఈ ప్లేయర్.. అంతర్జాతీయ క్రికెట్ మూడు ఫార్మట్‌లో సెంచరీలు చేసిన భారత ఐదవ ప్లేయర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేష్ రైనా, కేఎల్ రాహుల్ ఈ జాబితాలో ఉండగా.. గిల్ కూడా చేరిపోయాడు. అంతేకాకుండా టీమిండియా తరుపున టీ20ల్లో 23 ఏళ్లలోనే సెంచరీ చేసి యంగెస్ట్ క్రికెటర్‌గా కూడా రికార్డు నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.