CEAT Cricket Awards 2023: సూర్య కుమార్‌కు టీ20 ప్లేయర్ అవార్డు.. అతడికి డబుల్ ధమాకా..
2023 CEAT క్రికెట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ముంబైలో వైభవంగా జరిగింది.
దిశ, వెబ్‌డెస్క్: 2023 CEAT క్రికెట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ముంబైలో వైభవంగా జరిగింది. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో (మూడు ఫార్మాట్లలో) రేటింగ్స్ ఆధారంగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను CEAT జ్యూరీ అవార్డులకు ఎంపిక చేసింది. 'టీ20 బ్యాటర్ ఆఫ్ ద ఇయర్'గా టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఎంపిక కాగా.. 'టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డును న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ దక్కించుకున్నాడు. టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 'వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుతో పాటు 'ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. గిల్‌కు ఈ రెండు అవార్డులను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందజేశాడు.
CEAT అవార్డులు గెలుచుకున్న ఇతరుల వివరాలు..
టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్: భువనేశ్వర్ కుమార్
ఇన్నోవేటెడ్ కోచ్ ఆఫ్ ద ఇయర్: బ్రెండన్ మెక్కల్లమ్
ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: దీప్తి శర్మ
సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా దీప్తి శర్మ అవార్డును అందుకుంది.
Stepping off the pitch, but the echoes of excellence linger. Until next year! #ceatcricketawards 2023 #CEATCricketRating #CCR25 #CricketRatingAward #CEATCricketRatings #CEAT #ThisIsRPG pic.twitter.com/ijE3SZMiR0
— CEAT TYRES (@CEATtyres) August 21, 2023