టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్.. సర్జరీ సక్సెస్.. మెగా టోర్నీకి అందుబాటులోకి రానున్న మిడిల్ ఆర్డర్ బ్యాటర్!
వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమై చికిత్స కోసం లండన్ వెళ్లిన టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు సర్జరీ విజయవంతమైంది.
దిశ, వెబ్‌డెస్క్: వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమై చికిత్స కోసం లండన్ వెళ్లిన టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు సర్జరీ విజయవంతమైంది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్ తొలి మ్యాచ్‌కు దూరమైన అయ్యర్ రెండో టెస్టుకి అందుబాటులోకి వచ్చాడు. కానీ, వెన్ను నొప్పి ఎక్కువ అవడంతో మూడో మ్యాచ్ మధ్యలోనే జట్టు నుంచి నిష్క్రమించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సిరీస్‌కు పూర్తిగా దూరమైన అయ్యర్ ఐపీఎల్-2023 సీజన్‌కు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఈ క్రమంలో సర్జరీ కోసం లండన్ వెళ్లిన అతడు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు ప్రముఖ మీడియా కథనంలో వెల్లడైంది. అయితే శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరో మూడు నెలల సమయం పట్టనుంది.
దీంతో ఇంగ్లండ్‌లో ఆసీస్‌తో జరిగే ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అతడు దూరం అయో అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, అక్టోబరులో భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి మాత్రం అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఐపీఎల్-2023 సీజన్‌లో కేకేఆర్‌కు కెప్టెన్సీగా ఉన్న అయ్యార్.. ప్రస్తుతం నితీశ్ రాణా కేకేఆర్ సారథ్య బాధ్యతు చేపట్టాడు. అయితే రాణా నేతృత్వంలో కేకేఆర్ ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లలో కేవలం 2 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది.