Women's Asia Cup : టీమిండియాకు భారీ షాక్.. స్టార్ స్పిన్నర్ దూరం

ఆసియా కప్‌లో వరుసగా రెండు విజయాలతో జోరు మీద ఉన్న భారత మహిళల జట్టుకు షాక్ తగిలింది.

Update: 2024-07-21 12:07 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో వరుసగా రెండు విజయాలతో జోరు మీద ఉన్న భారత మహిళల జట్టుకు షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగింది. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే శ్రేయాంక గాయపడినట్టు తెలుస్తోంది. ఆమె ఎడమ చేతికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువ ఉండటంతో ఆమె మిగతా టోర్నీకి అందుబాటులో ఉండటం లేదని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ పేర్కొంది. ఆమె స్థానంలో స్పిన్నర్ తనూజ కన్వార్‌ను జట్టులోకి తీసుకున్నారు.

పాక్‌తో మ్యాచ్‌లో రాణించిన శ్రేయాంక 2 వికెట్లు పడగొట్టడంతోపాటు 14 పరుగులు చేసింది. మరోవైపు, శ్రేయాంక స్థానాన్ని భర్తీ చేసిన తనూజ‌ జాతీయ జట్టు నుంచి తొలిసారి పిలుపు అందుకుంది. ఆదివారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరపున అరంగేట్రం చేసింది. డెబ్యూ మ్యాచ్‌లోనే ఆకట్టుకున్న తనూజ 3.50 ఎకానమీతో బౌలింగ్ చేసి 14 పరుగులే ఇవ్వడంతోపాటు ఒక్క వికెట్ కూడా తీసింది.

Tags:    

Similar News