గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. ఆరంభ మ్యాచ్ లకు స్టార్ ప్లేయర్ దూరం

ఐపీఎల్‌-2023 సీజన్‌ ప్రారంభానికి ముందే డిఫెండింగ్‌ చాంపియన్ గుజరాత్‌ టైటాన్స్‌కు గట్టి షాక్ గిలింది.

Update: 2023-03-21 03:55 GMT

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్‌-2023 సీజన్‌ ప్రారంభానికి ముందే డిఫెండింగ్‌ చాంపియన్ గుజరాత్‌ టైటాన్స్‌కు గట్టి షాక్ గిలింది. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్, సౌతాఫ్రికా ప్లేయర్ డేవిడ్‌ మిల్లర్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. సౌతాఫ్రికా జట్టు తరఫున వన్డే సిరీస్ ఆడాల్సి ఉండటంతో గుజరాత్ టైటాన్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడలేకపోతున్నానని స్పష్టం చేశాడు. వన్డే వరల్డ్‌ కప్ సూపర్ లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగే వన్డే సిరీస్‌కు డేవిడ్ మిల్లర్‌తో సౌతాఫ్రికా స్టార్ ఆటగాళ్లంతా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు.

మార్చి 31న ఐపీఎల్‌-2023 మొదలవ్వనుండగా.. అదే రోజు నెదర్లాండ్స్‌తో సౌతాఫ్రికా తొలి వన్డే ఆడనుంది. ఏప్రిల్‌ 2న రెండో వన్డే జరగనుంది. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్‌కు సౌతాఫ్రికా నేరుగా అర్హత సాధించాలంటే ఈ రెండు వన్డేలు గెలవడం కీలకం. ఈ క్రమంలోనే క్రికెట్ సౌతాఫ్రికా స్టార్ ఆటగాళ్లందర్నీ అందుబాటులో ఉండాలని ఆదేశించింది.

Tags:    

Similar News