కోహ్లీ కోసం దేవుళ్లే ఆ పని చేశారు: Shoaib Akhtar

ఆసియా కప్ 2023 ఈ నెల 30న ప్రారంభం కానుంది.

Update: 2023-08-18 13:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2023 ఈ నెల 30న ప్రారంభం కానుంది. పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టు బలాబలాలపై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ గురించి పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాలోని ఎంసీజీ వేదికగా భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌ను ప్రస్తావిస్తూ.. కోహ్లీకి టైలర్ మేడ్ మ్యాచ్‌ అని పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు చూస్తుండగా.. కోహ్లీకి తన కింగ్‌డమ్‌ను తిరిగి ఇచ్చేందుకు క్రికెట్ దేవుళ్లు కుట్ర పన్నారని అన్నాడు. ‘ఇది నీ వేదిక, వచ్చి మరోసారి కింగ్ అనిపించుకో’ అని దేవుడే అతనికి చెప్పినట్లుగా ఆ మ్యాచ్ జరిగిందని గుర్తు చేశాడు.

చివరి ఓవర్‌లో హరీస్ రవూఫ్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లతో నిజంగానే కోహ్లీ తన కింగ్‌డమ్ తిరిగి సొంతం చేసుకున్నాడని అన్నారు. ఈ మ్యాచ్‌లో విరాట్ 53 బంతుల్లో 82 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అంతకుమందు రెండు మూడేళ్లు ఫామ్ లేమితో తంటాలుపడ్డ రన్ మెషిన్.. ఆ మ్యాచ్‌తోనే మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. ఇక నేటితో (ఆగస్టు 18) కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి కాగా.. వరల్డ్ కప్ తర్వాత తను వైట్ బాల్ క్రికెట్ వదిలేసి టెస్టులపై కాన్సంట్రేట్ చేస్తే మరో ఆరేళ్ల పాటు కెరీర్ కొనసాగించవచ్చని, సచిన్ 100 సెంచరీల రికార్డును కూడా బ్రేక్ చేయగలడని అభిప్రాయపడ్డాడు అక్తర్.


Similar News