నమీబియాపై స్కాట్లాండ్ ఘన విజయం.. టేబుల్ టాపర్‌గా పసికూన
టీ20 వరల్డ్ కప్ లో స్కాట్లాండ్ మరో ఘనత సాధించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: టీ-20 వరల్డ్ కప్ గ్రూప్ -బి లో భాగంగా జరిగిన మ్యాచ్ లో నమిబియాతో జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్-బీలో మూడు పాయింట్లతో పసికూన స్కాట్లాండ్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 12:30 గంటలకు బార్బడోస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆరంభంలోనే నమిబీయా తడబడింది. ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన వికెట్ కీపర్ జేన్ గ్రీన్ తో కలిసి కెప్టెన్ గ్రెర్హార్డ్ ఎరాస్మస్ (52; 31 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకం సాధించి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. అనంతరం లక్ష్య ఛేదనకు వచ్చిన స్కాట్లాండ్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన విజయం సాధించింది. రిచీ బెరింగ్టన్ (47 నాటౌట్; 35 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మైకేల్ లీస్క్ (35; 17 బంతుల్లో, 4 సిక్సర్లు) టీమ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.