Sarabjot Singh : పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ తిరస్కరించిన షూటర్ సరబ్‌జోత్ సింగ్
భారత స్టార్ షూటర్ సరబ్‌జోత్ సింగ్ పారిస్ ఒలింపిక్స్ క్రీడలలో మను భాకర్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకం గెల్చుకున్న సంగతి తెలిసిందే
దిశ, వెబ్‌డెస్క్ : భారత స్టార్ షూటర్ సరబ్‌జోత్ సింగ్ పారిస్ ఒలింపిక్స్ క్రీడలలో మను భాకర్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకం గెల్చుకున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రతిష్ఠను పెంచినందుకు పంజాబ్ ప్రభుత్వం అతనికి స్పోర్ట్స్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి సిద్దమయింది. ప్రభుత్వ ఉద్యోగమంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు కానీ సరబ్‌జోత్ సింగ్ మాత్రం ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడు .ఈ రోజు అతను ప్రెస్ ట్రస్ట్ అఫ్ ఇండియా (PTI) తో మాట్లాడూతూ.. 'పంజాబ్ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నా దృష్టంతా షూటింగ్ మీదే ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత జాబ్ గురించి ఆలోచిస్తానని ’ .. సరబ్‌జోత్ సింగ్ తెలిపాడు.