Varanasi Cricket Stadium: మోదీకి సచిన్, జై షా గిఫ్ట్స్.. ఏమిచ్చారో తెలుసా?

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో.. నూతన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటు కానుంది.

Update: 2023-09-23 13:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో.. నూతన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటు కానుంది. ఈ స్టేడియం నిర్మాణానికి ప్రధాని మోదీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, బీసీసీఐ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి జై షా, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్, రవిశాస్త్రి తదితరులు హాజరయ్యారు.


అయితే ఈ కార్యక్రమంలో భాగంగా టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్.. మోదీకి భారత్ జెర్సీని అందజేశారు. ఒకటో నెంబర్‌తో ఉన్న ఈ జెర్సీ వెనకాల 'నమో' అని రాసి ఉంది. అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా.. ప్రధానికి బ్యాట్​ జ్ఞాపికను అందజేశారు.


Similar News