దిశ, వెబ్‌డెస్క్ః సచిన్ టెండుల్కర్ అనగానే బౌండరీ దాటుతున్న బాల్స్ కళ్లముందు కదలడం సహజం. ఎవరు ఎటు నుంచి బాల్స్ వేసినా చుక్కలు చూపించగల సూపర్ బ్యాట్స్‌మ్యాన్ ఈ క్రికెట్ లెజెండ్. అయితే, తాను ఓ కాంప్లికేటెడ్ మనిషినని అంటున్నాడు. దానిపైన వివరణ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు. ఓ రెస్టారెంట్లో ఏదో తింటూ రెండు చేతులతో పనిచేయగలగడం గురించి ఈ వీడియోలో తెలియజేశాడు. సవ్యసాచిగా ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయంటూ తన ముందున్న ప్లేట్లో ఆహార పదార్థాన్ని రెండు చేతులతో తినడం చూపించాడు. "ఎడం చేతిలో ఫోర్క్, కుడిచేతిలో చాప్‌స్టిక్స్ పట్టుకొని తినగలుగుతాను. ఎడం చేత్తో ఫోర్క్, స్పూన్, చాకుల్ని పట్టుకొని తింటాను కానీ చాప్స్టిక్స్ను మాత్రం పట్టుకోలేను. ఎందుకో తెలియదు. నేను ఎడం చేత్తో రాస్తాను కూడా. అయినా, చాప్‌స్టిక్స్ పట్టుకోవడం నావల్ల కాదు... కారణం మాత్రం అర్థం కాదు. చాప్‌స్టిక్స్ పట్టుకోగానే నా మైండ్‌లో ఏమవ్వుద్దో చెప్పలేను కానీ వాటి పట్టుకోలేను" అని వివరించాడు. సచిన్ పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసి అభిమానులు సరదా కామెంట్లతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.