ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లిన సబలెంక
ఫ్రెంచ్ ఓపెన్‌లో 2వ సీడ్ సబలెంక జోరు కొనసాగుతోంది.
దిశ, స్పోర్ట్స్ : పారిస్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో 2వ సీడ్ సబలెంక జోరు కొనసాగుతోంది. ప్రత్యర్థులను అలవోకగా చిత్తు చేస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా ఆమె ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ మూడో రౌండ్లో సబలెంక 7-5, 6-1 తేడాతో పౌలా బడోసాపై విజయం సాధించింది. గంటా 17 నిమిషాల్లోనే ఆమె వరుసగా రెండు సెట్లను గెలుచుకుంది. 4వ సీడ్ రిబాకినా(కజకిస్తాన్) సైతం ముందడుగు వేసింది. మూడో రౌండ్లో బెల్జియం క్రీడాకారిణి ఎలిస్ మెర్టిన్స్పై 6-4, 6-2 తేడాతో నెగ్గింది. 7వ సీడ్ క్వినెన్ జెంగ్(చైనా) మూడో రౌండ్లోనే ఇంటిదారిపట్టింది. ఆమెకు అన్‌సీడ్ క్రీడాకారిణి ఎలినా అవనేస్యన్ 3-6, 6-3, 7-6(10-6) తేడాతో షాకిచ్చింది. మరోవైపు, పురుషుల సింగిల్స్‌లో 4వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ) కష్టంగా నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. ఐదు సెట్లుగా సాగిన మూడో రౌండ్లో జ్వెరెవ్ 3-6, 6-4, 6-2, 4-6(7-6(10-3) తేడాతో టాలన్ గ్రీక్స్పూర్(నెదర్లాండ్స్)పై పోరాడి గెలిచాడు. 5వ సీడ్ మెద్వెదెవ్ సైతం విజయం కోసం శ్రమించాడు. అన్‌సీడ్ ప్లేయర్ టోమస్ మచాక్(చెక్ రిపబ్లిక్) అతనికి గట్టి పోటీనిచ్చాడు. నాలుగు సెట్లలో జరిగిన మ్యాచ్‌లో మెద్వెదెవ్ 6-7(4-7), 5-7, 6-1, 4-6 తేడాతో విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నాడు.