Rohith Sharma:హిట్‌మాన్ ఫిట్‌నెస్‌పై చిన్ననాటి కోచ్ సంచలన కామెంట్స్
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ-20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమి, ఓపెనింగ్ జోడిపై రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ స్పందించారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ-20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమి, ఓపెనింగ్ జోడిపై రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ స్పందించారు. ప్రపంచ కప్‌లో భారత్ ఓపెనింగ్ జోడి దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆరు మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్ 128 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 116 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో టీమిండియా ప్రదర్శన సరిగ్గా లేదని.. ఈ ప్రభావం టీమ్‌పై తీవ్రంగా పడిందని దినేష్ లాడ్ అభిప్రాయపడ్డాడు. రాహుల్, రోహిత్ జోడి స్కోరింగ్ పరంగా చాలా బలహీనంగా ఉందని, దీంతో ప్లవర్ ప్లేలో స్కోర్ బోర్డు పరుగులు పెట్టలేదని అభిప్రాయపడ్డారు.
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ .. తన సహజ దూకుడైన ఆటతీరును కనబర్చలేదు. ఈసారి జట్టు కెప్టెన్‌గా బరిలోకి తిగడంతో ఒత్తిడికి గురయ్యాడు. ప్రారంభ ఓవర్లలో పరుగులు చేయలేక ఒత్తిడికి గురైన రోహిత్, తర్వాత ప్రతిసారి బంతిని హిట్ చేయడానికి ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడని.. దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఇలానే జరిగిందని దినేష్ పేర్కొన్నారు.