కోచ్ అవతారమెత్తిన హిట్‌మ్యాన్.. నెట్స్‌లో సిరాజ్, కుల్దీప్‌లకు బ్యాటింగ్ పాఠాలు
జట్టు బ్యాటింగ్ పరంగా మెరుగవడంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పెషల్ ఫోకస్ పెట్టాడు. మంగళవారం నెట్స్‌లో అతను కోచ్ అవతారమెత్తాడు.
దిశ, స్పోర్ట్స్ : ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈ నెల 15 నుంచి 19 వరకు రాజ్‌కోట్ వేదికగా జరిగే మూడో టెస్టులో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా సిద్ధమవుతున్నది. సోమవారం రాజ్‌కోట్ చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ దూరమవడంతో మిడిలార్డర్ బలహీనపడింది. సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్ ఈ మేరకు రాణిస్తారో చెప్పలేం. లోయర్ ఆర్డర్ కూడా బ్యాటింగ్‌లో ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెయిలెండర్లు చేసే పరుగులు అప్పుడప్పుడు చాలా కీలకమవుతాయి. ఈ నేపథ్యంలో జట్టు బ్యాటింగ్ పరంగా మెరుగవడంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పెషల్ ఫోకస్ పెట్టాడు. మంగళవారం నెట్స్‌లో అతను కోచ్ అవతారమెత్తాడు. టెయిలెండర్లకు బ్యాటింగ్ పాఠాలు చెప్పాడు. పేసర్ మహ్మద్ సిరాజ్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, వికెట్ కీపర్ కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఈ సెషన్‌లో పాల్గొన్నారు. హెడ్ పొజిషన్ ప్రాముఖ్యతను రోహిత్ వివరించాడు. అలాగే, పలు సూచనలు చేశాడు. అనంతరం సిరాజ్, కుల్దీప్‌లకు నెట్ బౌలర్లతో త్రో డౌన్‌లు వేయించాడు. ఆ తర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి వారి బ్యాటింగ్‌ను గమనించాడు.