రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ ఏమన్నాడంటే?

తాజాగా ‘బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్’ షోలో పాల్గొన్న రోహిత్ తన భవిష్యత్తు ప్రణాళికల గురించి పలు విషయాలు వెల్లడించాడు.

Update: 2024-04-12 12:14 GMT

దిశ, స్పోర్ట్స్ : రిటైర్మెంట్ గురించి అసలు ఆలోచించడం లేదని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తాజాగా ‘బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్’ షోలో పాల్గొన్న రోహిత్ తన భవిష్యత్తు ప్రణాళికల గురించి పలు విషయాలు వెల్లడించాడు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ), వన్డే వరల్డ్ కప్-2027 గెలవాలని ఉందన్నాడు. ‘రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదు. కానీ, జీవితం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. ప్రస్తుతం నేను బాగానే ఆడుతున్నా. మరికొన్నేళ్లు దాని్ని కొనసాగించాలనుకుంటున్నా. వన్డే వరల్డ్ కప్‌లో, డబ్ల్యూటీసీ ఫైనల్‌‌లో గెలవాలని ఉంది. భారత్ సాధిస్తుందని ఆశిస్తున్నా.’ అని తెలిపాడు.

అలాగే, గతేడాది వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్‌లో భారత్ ఓటమిపై రోహిత్ మరోసారి స్పందించాడు. 50 ఓవర్ల వరల్డ్ కప్ చూస్తూనే పెరిగామని, తన దృష్టిలో వన్డే వరల్డ్ కపే అసలైన ప్రపంచకప్ అని చెప్పాడు. ‘గతేడాది మన దేశంలో మన అభిమానుల మధ్య జరిగింది. సెమీస్‌‌లో గెలిచాక టైటిల్‌కు మరో అడుగు దూరంలో ఉన్నామని అనుకున్నా. ఫైనల్‌లో ఎందుకు ఓడిపోయామా? అని ఆలోచిస్తే ఒక్క విషయం కూడా నాకు తట్టలేదు. ఎందుకంటే, అన్ని విభాగాల్లోనూ రాణించాం. ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. కానీ, అది మాకు చెడ్డ రోజు. ఫైనల్‌లో బాగా ఆడలేదని మాత్రం అనుకోవడం లేదు. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. ఆస్ట్రేలియా మా కంటే కాస్త బెటర్‌గానే ఆడింది.’ అని చెప్పాడు. 

Tags:    

Similar News