బుర్ర పెట్టి ఆలోచించండి.. రోహిత్ శర్మ సీరియస్!

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ సూపర్-8 టోర్నీలో ఆస్ట్రేలియాపై టీమిండియా జట్టు ఘన విజయం సాధించి సెమీస్‌కు క్వాలిఫై అయిన విషయం తెలిసిందే.

Update: 2024-06-27 17:23 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ సూపర్-8 టోర్నీలో ఆస్ట్రేలియాపై టీమిండియా జట్టు ఘన విజయం సాధించి సెమీస్‌కు క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. అయితే, ఇండియా గెలిచేందుకు బాల్ ట్యాంపరింగ్ చేసిందని పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్, మాజీ ఆటగాడు సలీమ్ వివాదాస్పద కామెంట్స్ చేశారు.16 ఓవర్‌లో హర్షదీప్ వేసిన బంతి రివర్స్ స్వింగ్ కావడానికి బాల్ ట్యాంపరింగ్ కారణమని వారు ఆరోపించారు.తాజాగా ఆ కామెంట్స్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా స్పందించారు.

తాము ఆడుతున్న ప్రదేశంలో వాతావరణ పరిస్థితుల వల్ల బౌలర్లు రివర్స్ స్వింగ్ చేసినట్లు పేర్కొన్నారు. టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న ప్రదేశంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించాలన్నారు. చాలా ఎండలో మ్యాచ్ ఆడుతున్నామని, వికెట్ చాలా డ్రైగా ఉందని, దీని వల్ల బంతి ఆటోమెటిక్ రివర్స్ అవుతుందని చెప్పారు. దాదాపు అన్ని జట్లకూ ఇలాగే జరుగుతోందన్నారు. మేమే కాదు, అన్ని జట్లూ రివర్స్ స్వింగ్ చేస్తున్నాయని, ఇటువంటి వ్యాఖ్యలు చేసేందుకు బుర్ర పెట్టి ఆలోచించాలని, వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలో మ్యాచ్ జరగడం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.


Similar News