రోహన్ బొపన్నకు 9వ ర్యాంక్.. టాప్ టెన్‌లో తొలిసారి

వెటరన్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బొపన్న ఏటీపీ డబుల్స్‌లో 9వ ర్యాంక్ సాదించాడు.

Update: 2023-05-24 13:09 GMT

న్యూఢిల్లీ: వెటరన్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బొపన్న ఏటీపీ డబుల్స్‌లో 9వ ర్యాంక్ సాదించాడు. అతడు 9 ఏళ్ల తర్వాత తొలిసారి టాప్ 10 ర్యాంకుల్లో చోటు దక్కించుకోవడం విశేషం. 43 ఏళ్ల బొపన్న మోకాలి నొప్పితో గతేడాది డేవిస్ కప్, ఇతర టోర్నమెంట్లలో పాల్గొనలేదు. దీంతో 19వ ర్యాంకుతో ఈ ఏడాది సీజన్ ను ప్రారంభించిన బొపన్న ఇప్పటికే 13 టోర్నమెంట్లు ఆడాడు. 2016లో తన కెరీర్ బెస్ట్‌గా ప్రపంచంలోనే మూడవ ర్యాంకు సాధించాడు.

మార్చి నెలలో ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్ తో కలిసి ఇండియన్ వేల్స్ మాస్టర్స్ టోర్నమెంట్‌‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. దీంతో ఏటీపీ మాస్టర్స్ 1000వ టోర్నమెంట్ సాధించిన అతి పెద్ద వయస్సు గల ఆటగాడిగా బొపన్న నిలిచాడు. ఫిబ్రవరిలో ఖతార్ ఓపెన్ టైటిల్ సాధించిన బొపన్న ఎబ్డెన్ జోడీ ఈ నెలలో జరిగిన మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్ కు కూడా చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్‌‌లో సుమిత్ నాగల్ ప్రపంచంలో 256వ ర్యాంకులో నిలిచాడు. ఆసియన్ గేమ్స్ కాంస్య పతక విజేత అంకిత రైనా మహిళా సింగిల్స్ లో 212 ర్యాంకు సాధించింది.

Tags:    

Similar News