Rishabh Pant accident:పంత్ హెల్త్ కండిషన్‌పై బీసీసీఐ కీలక ప్రకటన
టీమిండియా ఆటగాడు రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురి కాగా బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.
దిశ, వెబ్ డెస్క్: టీమిండియా ఆటగాడు రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురి కాగా బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. పంత్ నుదురు చిట్లిందని తెలిపింది. వీపుపై కాలిన గాయాలున్నాయని, కుడి మోకాలి లిగ్మెంట్ జరిగినట్లు ఎక్స్ రేలో తేలిందని పేర్కొంది. అయితే ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ప్రకటించింది. పంత్ ట్రీట్ మెంట్ కొనసాగుతోందని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. పంత్ కుటుంబసభ్యులతో మాట్లాడానన్నారు.
రిషభ్ త్వరగా కోలుకొని రావాలని ప్రార్థించారు. బీసీసీఐ తరపున ఎలాంటి సహాయం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. పంత్ యాక్సిడెంట్ ఘటనపై స్పందించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వైద్య ఖర్చులను తమ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. కాగా రిషభ్ పంత్ ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా ఈ రోజు ఉదయం కారు ప్రమాదానికి గురైంది. ఢిల్లీ - డెహ్రాడూన్ ఎన్ హెచ్ పై రోడ్డు మధ్యలో ఉన్న రెయిలింగ్ పైకి పంత్ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు దూసుకెళ్లింది.